Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైకోర్టు తీర్పును ధిక్కరించి రైతు భూమిలో అక్రమ నిర్మాణం.. కలెక్టర్‌కు పోలగోని మల్లయ్య ఫిర్యాదు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 16, 2026 02:37 AM

హైకోర్టు తీర్పును ధిక్కరించి రైతు భూమిలో అక్రమ నిర్మాణం.. కలెక్టర్‌కు పోలగోని మల్లయ్య ఫిర్యాదు

హైకోర్టు తీర్పును ధిక్కరించి రైతు భూమిలో అక్రమ నిర్మాణం.. కలెక్టర్‌కు పోలగోని మల్లయ్య ఫిర్యాదు

హైకోర్టు తీర్పును ధిక్కరించి రైతు భూమిలో అక్రమ నిర్మాణం.. కలెక్టర్‌కు పోలగోని మల్లయ్య ఫిర్యాదు
June 16, 2026 12:27 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

గౌరవ తెలంగాణ హైకోర్టు తీర్పు, రిజిస్టర్డ్ సేల్ డీడ్, పట్టాదారు పాసుబుక్ తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ తన పట్టా భూమిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కనగల్ మండలానికి చెందిన రైతు పోలగోని మల్లయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, కార్యదర్శి శ్రీనాథ్ రాజు, కాంట్రాక్టర్ గంజి మార్కొండయ్య, సూపర్‌వైజర్ ముషం సాయికుమార్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.

కనగల్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 637-11/1లో ఉన్న ఎకరం భూమి తన పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిందని, దీనికి సంబంధించి 1993లో నమోదైన రిజిస్టర్డ్ సేల్ డీడ్, కొత్త పట్టాదారు పాసుబుక్, ఖాతా నంబర్ 1176 తన పేరుమీద ఉన్నాయని మల్లయ్య తెలిపారు. గత 40 సంవత్సరాలుగా తాము ఆ భూమిని అనుభవిస్తున్నామని పేర్కొన్నారు.

గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తన భూమిలో ఆర్చి నిర్మించారని, దీనిపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 30027/2023 దాఖలు చేయగా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. కలెక్టర్ కేటాయించిన స్థలంలోనే నిర్మాణాలు చేపట్టాలని, తన పట్టా భూమిలోకి ప్రవేశించవద్దని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ అదే భూమిలో భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపించారు.

తనకు ప్రమాదం జరిగి గత నాలుగేళ్లుగా కుటుంబంతో కలిసి నల్గొండ పట్టణంలో నివసిస్తున్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని అధికారులు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్‌డీఓ, ఎస్పీ, ఎస్‌ఐ, తహశీల్దార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి తదితర అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.

తన భూమికి సంబంధించి సర్వే నిర్వహిస్తామని 2025 ఏప్రిల్ 3న, 2026 మే 11న నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు సర్వే పూర్తి చేయలేదని ఆరోపించారు. ఇటీవల భూమిలో మట్టి పోసి చదును చేస్తున్న సమయంలో తాము అడ్డుకోగా పోలీసులు, తహశీల్దార్ సంఘటనా స్థలానికి వచ్చారని తెలిపారు. అయితే సరైన సర్వే నిర్వహించకుండా నోటిమాటలతో భూమి తనది కాదని చెప్పారని ఆరోపించారు.

తహశీల్దార్ తనతో అవమానకరంగా మాట్లాడడమే కాకుండా, చనిపోయిన వ్యక్తిని తీసుకువస్తేనే భూమి చూపిస్తానంటూ హేళన చేశారని మల్లయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే హైకోర్టు ఉత్తర్వులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఉన్నతాధికారుల సూచనలను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు.

సూర్యాపేట జిల్లా నుంచి తీసుకొచ్చిన సర్వేయర్ పేరుకే సర్వే చేసి ఎలాంటి నివేదిక ఇవ్వకుండా వెళ్లిపోయారని, తాము పదేపదే కోరినా అధికారిక సర్వే రిపోర్టు అందించలేదని తెలిపారు. రాజకీయ నాయకుల అండదండలతో కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేద రైతుల భూములను బలవంతంగా ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.

కావున తన ఫిర్యాదుపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి, తన పట్టా భూమిలో జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేయడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని రైతు పోలగోని మల్లయ్య జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News