Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:51 AM

విద్యను వ్యాపారంగా మార్చొద్దు. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలి: చినపాక రమేష్.

16-06-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల చదువులను, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని బీఆర్‌ఎస్‌వీ నకిరేకల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, నీర్నెముల 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ ఆరోపించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులను రేకుల షెడ్లలో నిర్వహించడం వల్ల చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలు లేని బోధనా సిబ్బందితో, అరకొర వసతులతో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఫీజుల కోసం తల్లిదండ్రులను వేధిస్తూ అధిక మొత్తాలు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల చేరికలను పెంచేందుకు అధికారులు కృషి చేసి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని చినపాక రమేష్ కోరారు.

Sthanikam

విద్యను వ్యాపారంగా మార్చొద్దు. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలి: చినపాక రమేష్.

Article Image

రామన్నపేట: మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల చదువులను, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని బీఆర్‌ఎస్‌వీ నకిరేకల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, నీర్నెముల 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ ఆరోపించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులను రేకుల షెడ్లలో నిర్వహించడం వల్ల చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలు లేని బోధనా సిబ్బందితో, అరకొర వసతులతో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఫీజుల కోసం తల్లిదండ్రులను వేధిస్తూ అధిక మొత్తాలు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల చేరికలను పెంచేందుకు అధికారులు కృషి చేసి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని చినపాక రమేష్ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News