Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:23 PM

ఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఏలే కీలక భూమిక – సంగారెడ్డిలో అవగాహన శిక్షణా శిబిరం

16-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణంలోని రెడ్లస్ హోటల్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) అవగాహన మరియు శిక్షణా శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ శిక్షకులు రాజీవ్ మరియు శిక్షక బృందం బీఎల్ఏలకు ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, మరణించిన మరియు వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించారు. నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసి యువతను ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు జాబితాలోని లోపాలను సరిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పన ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో బీఎల్ఏలు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఏలే కీలక భూమిక – సంగారెడ్డిలో అవగాహన శిక్షణా శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News