Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

16-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని సంఘం మండల ప్రధాన కార్యదర్శి గామాసు జోగయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవనంలో మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం సంఘం అధ్యక్షుడు నాగులవంచ వెంకటరామయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా గామాసు జోగయ్య మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూలి పనిపై ఆధారపడే కుటుంబాలు పౌష్టికాహారం అందక రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు అధికమై కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని అన్నారు. వ్యవసాయ కూలీలు, పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా వెంకటాపురం గ్రామంలో తాళ్లూరు వెంకటనారాయణ సంఘం జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కుడెల్లి నాగేశ్వరరావు, షేక్ నాగుల్‌మీరా, పుటేటి వెంకటనారాయణరెడ్డి, మస్తాన్, భసవయ్య, నక్క పుల్లరావు, కోల రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News