Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం

16-06-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణం, మండల పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై, అలాగే నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్‌లోనే పుస్తకాలు విక్రయిస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఎంఈఓకు వారు వినతి పత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, మండల అధ్యక్షుడు పబ్బు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే అనుమతులు లేని పాఠశాలలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తెలుకుంట్ల శ్రీకాంత్, సోషల్ మీడియా ఇంచార్జి గట్టు పవన్, దూసరి శివసాయి, బాతరాజు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం

Article Image

చౌటుప్పల్ పట్టణం, మండల పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై, అలాగే నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్‌లోనే పుస్తకాలు విక్రయిస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఎంఈఓకు వారు వినతి పత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, మండల అధ్యక్షుడు పబ్బు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే అనుమతులు లేని పాఠశాలలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తెలుకుంట్ల శ్రీకాంత్, సోషల్ మీడియా ఇంచార్జి గట్టు పవన్, దూసరి శివసాయి, బాతరాజు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News