Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 11:04 PM

15 రోజుల్లో ఆరోగ్య సంస్థల నమోదులు పూర్తి చేయాలి ఏబీడీఎం అమలుపై కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు

16-06-2026 185 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు, వైద్య సిబ్బంది హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (HFR), హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ (HPR) నమోదులను వచ్చే 15 రోజుల్లో 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) మోడల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమం అమలును సమీక్షించిన కలెక్టర్.. భువనగిరి, చౌటుప్పల్ పట్టణాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నమోదులను వేగవంతం చేయాలని సూచించారు.

మహిళల్లో రక్తహీనత నివారణకు చేపట్టనున్న అనీమియా ట్రాకింగ్ ఫర్ ఉమెన్ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, గ్రామస్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి విస్తృత స్థాయిలో పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు.

ఆగస్టు రెండో వారంలో జరగనున్న ఎన్‌క్యూఏఎస్ (NQAS) బృందం పర్యటన దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపు, క్షయవ్యాధి గుర్తింపు, ఎన్‌సీడీ స్క్రీనింగ్, ఆర్‌బీఎస్‌కే కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.

వర్షాకాలంలో డెంగ్యూ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆరోగ్య శాఖ పరిధిలో కొనసాగుతున్న సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. ఎం. మనోహర్, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

15 రోజుల్లో ఆరోగ్య సంస్థల నమోదులు పూర్తి చేయాలి ఏబీడీఎం అమలుపై కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News