Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:23 PM

దిల్ సుఖ్ నగర్ లో పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల ధర్నా

16-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బినగర్,

పోలీస్ నియామకాల్లో వయోపరిమితి పెంపుతో పాటు పెండింగ్ నోటిఫికేషన్లను విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల జేఏసీ ఆధ్వర్యంలో దిల్ సుఖ్ నగర్ లో మంగళవారం సాయంత్రం మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత, విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ19/20 పే స్కేల్ ఉద్యోగాలతో పాటు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు 36 సంవత్సరాలు, ఎస్‌ఐ పోస్టులకు 38 సంవత్సరాల వయోపరిమితి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో తెలంగాణ పోలీస్ విద్యార్థుల జేఏసీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ర్యాలీ నిర్వహిస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Sthanikam

దిల్ సుఖ్ నగర్ లో పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News