Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

భారీ వర్షాలపై అప్రమత్తం. వాటర్‌లాగింగ్ ప్రాంతాల పరిశీలన.. అధికారులకు డీసీపీ అనురాధ ఆదేశాలు

16-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్ : ర్రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎల్బీనగర్ డీసీపీ అనురాధ (ఐపీఎస్) అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డితో కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాటర్‌లాగింగ్ ప్రాంతాలను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నీటి నిల్వల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన యంత్రాంగం, సిబ్బందిని అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఎస్‌హెచ్‌వో రవిబాబు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

భారీ వర్షాలపై అప్రమత్తం. వాటర్‌లాగింగ్ ప్రాంతాల పరిశీలన.. అధికారులకు డీసీపీ అనురాధ ఆదేశాలు

Article Image

ఎల్బీనగర్ : ర్రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎల్బీనగర్ డీసీపీ అనురాధ (ఐపీఎస్) అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డితో కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాటర్‌లాగింగ్ ప్రాంతాలను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నీటి నిల్వల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన యంత్రాంగం, సిబ్బందిని అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఎస్‌హెచ్‌వో రవిబాబు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News