Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 11:09 PM

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టాలి..

16-06-2026 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఎమ్జీయూ ఉపకులపతికి వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ ప్రతినిధులు..

నల్గొండ : మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎమ్జీయూ)లో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రారంభించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) యూనివర్సిటీ శాఖ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో ఎమ్జీయూ ఇతర వర్సిటీలకు ధీటుగా ముందు వరుసలో నిలుస్తోందని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక ప్రభుత్వ విద్యా సంస్థ ఇదేనని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా విద్యార్థుల ఆకాంక్షల మేరకు మరిన్ని కొత్త కోర్సులను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. వర్సిటీలో హిందీ, సంస్కృతం, యోగా, ఎంఏ (పొలిటికల్ సైన్స్), ఫిలాసఫీ, సోషియాలజీ, లిటరేచర్, జర్నలిజం వంటి కోర్సులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు ఎమ్మెస్సీ జువాలజీ, మైక్రో బయాలజీ, ఫారెస్ట్రీ, ఎమ్మేడ్, బీఎడ్, ఎంపైడ్, బీపెడ్ మరియు బీటెక్ కోర్సులను ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్, సంపత్, మౌనేష్ చారి, విజయ్, వెంకటేష్, సతీష్, సూర్య, అజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News