Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:21 PM

రైతుల పేరుతో రాజకీయాలు మానుకోవాలి. ఎండి రేహాన్

16-06-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ధాన్యం కొనుగోళ్ల అంశంపై వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఎండి రేహాన్ మండిపడ్డారు. రైతుల సమస్యల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను నకిరేకల్ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

మంగళవారం రామన్నపేటలో కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ధాన్యం కొనుగోళ్లను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని, రామన్నపేట మండలంలో అధిక దిగుబడులు, లారీల కొరత, రైస్‌మిల్లుల్లో అన్‌లోడింగ్ సమస్యల కారణంగా స్వల్ప జాప్యం ఏర్పడిందన్నారు. సమస్యను గుర్తించిన వెంటనే జిల్లా వ్యాప్తంగా 107 రైస్‌మిల్లులతో సమన్వయం చేసి కొనుగోళ్లను వేగవంతం చేసినట్లు చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో పెండింగ్ ధాన్యం పూర్తిగా కొనుగోలు అవుతుందని స్పష్టం చేశారు.ప్రజల తీర్పును గౌరవించకుండా విమర్శలు కొనసాగిస్తే నకిరేకల్ ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి అబ్రహం కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి జమీరుద్దీన్, మాజీ పీసీసీ కార్యదర్శి గోదాసు పృథ్వీరాజ్, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ జెల్లా వెంకటేశం, ఎండి నాసర్, ఎండి అక్రమ్, కొమ్ము శేఖర్, ఏటేలి పరమేష్, నోముల ప్రవీణ్, గొరిగే శేఖర్, జువ్వాల శ్రీకాంత్, మేడి ధ్రువ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతుల పేరుతో రాజకీయాలు మానుకోవాలి. ఎండి రేహాన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News