Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:20 PM

వరసిద్ధి వినాయక ఆలయంలో నూతన భవనం ప్రారంభం

16-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్, : కొత్తపేట డివిజన్ పరిధిలోని గాయత్రిపురం కాలనీలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో నూతన భవనం, ప్రధాన ద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపేట మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్‌కుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొని నూతన భవనం, ప్రధాన ద్వారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులు, దాతలను అభినందించారు. కాలనీవాసులు, దాతల సహకారంతో ఆలయం అభివృద్ధి చెందడం సంతోషకరమన్నారు.

ఆలయ కమిటీ అధ్యక్షుడు దుద్దిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల సహకారం, స్థానికుల కృషితో శ్రీ వరసిద్ధి వినాయక, సద్గురు సాయిబాబా ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆలయ మరింత అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని కోరారు.

రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండగా అత్యవసర సమావేశాల కారణంగా రాలేకపోయారని, బుధవారం ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉన్నట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.

కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్‌కుమార్, వెంకట్‌రెడ్డి, గాయత్రిపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నవీన్‌కుమార్, అనంతరాములు, జే. బాలరాజు, జితేందర్‌రెడ్డి, శ్రీకాంత్, డాక్టర్ రాజయ్య గుప్త తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వరసిద్ధి వినాయక ఆలయంలో నూతన భవనం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News