Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం కార్యదర్శిగా చిన్నం బాలరాజు

16-06-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామ ఉప సర్పంచ్ చిన్నం బాలరాజు కురుమ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.​తన నియామకంపై చిన్నం బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో ఇంతటి కీలక బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...​"రాష్ట్రంలోని ఉప సర్పంచుల హక్కుల పరిరక్షణకు, స్థానిక సంస్థల బలోపేతానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. గ్రామ పంచాయతీల అభివృద్ధి, ప్రజాప్రతినిధుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం అందుబాటులో ఉంటాను."

​తన నియామకానికి సహకరించిన ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జిగ నరేష్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సుర్కంటి శ్రీధర్ రెడ్డితో పాటు రాష్ట్రంలోని ఉప సర్పంచులందరికీ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. బాలరాజు నియామకం పట్ల నేలపట్ల గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Sthanikam

రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం కార్యదర్శిగా చిన్నం బాలరాజు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News