సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో వెలసిన శ్రీ దండు మైసమ్మ తల్లి సన్నిధిలో నూతన వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు.
నూతన వాహనం సకల శుభాలతో, విజయవంతంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య వాహన పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి