Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:22 PM

కర్తవ్యనిష్ఠకు నిలువెత్తు నిదర్శనం హన్మా రెడ్డి: మున్సిపల్ చైర్మన్ నగేష్ షేట్కార్

17-06-2026 171 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని సాయి బాబా ఫంక్షన్ హాల్‌లో మానూర్ మండలంలోని శేల్గీర గ్రామానికి చెందిన శ్రీ హన్మా రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ మాట్లాడుతూ, హన్మా రెడ్డి గారు తమ ఉద్యోగ జీవితమంతా నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు, ప్రభుత్వానికి సేవలందించి ఎలాంటి మచ్చ లేకుండా పదవీ విరమణ చేయడం అభినందనీయమని అన్నారు. ఆయన సేవా తత్వం, కర్తవ్యనిష్ఠ, సహోద్యోగులతో కొనసాగించిన సత్సంబంధాలు అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగ బాధ్యతల నుంచి మాత్రమేనని, సమాజానికి వారి అనుభవం, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ అవసరమని పేర్కొన్నారు. అలాగే హన్మా రెడ్డి కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగల్గిద్దా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్‌రావు పటేల్, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, అంజిరెడ్డి, శేరికర్ నందు, వాహేద్, శేల్గీర గ్రామ ప్రముఖులు, మానూర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని హన్మా రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు.

Sthanikam

కర్తవ్యనిష్ఠకు నిలువెత్తు నిదర్శనం హన్మా రెడ్డి: మున్సిపల్ చైర్మన్ నగేష్ షేట్కార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News