Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:32 AM

ప్రజల భద్రత కోసం.బాధ్యతతో ముందుకు సాగుతున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్

17-06-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అవసరమైన పరికరాలను పంపిణీ చేసి, విధి నిర్వహణలో పాటించాల్సిన ముఖ్య సూచనలు అందించారు.

విధుల్లో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని అత్యవసర అవసరాలకే పరిమితం చేయాలని, వ్యక్తిగత అవసరాలు లేదా సోషల్ మీడియా వినియోగం విధులపై ప్రభావం చూపడమే కాకుండా పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశముందని సూచించారు.యూనిఫాంలో ఉన్న ప్రతి పోలీసు ప్రజల పరిశీలనలో ఉంటారని, అందువల్ల ప్రవర్తనలోనూ, విధి నిర్వహణలోనూ అత్యంత బాధ్యత, అప్రమత్తత, నిబద్ధతతో వ్యవహరించాలని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల ప్రారంభం మరియు ముగింపు సమయాలు, రద్దీ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసుల సేవలను జిల్లా ఎస్పీ అభినందించారు. రహదారులపై క్రమశిక్షణ, భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ట్రాఫిక్ పోలీసుల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

Sthanikam

ప్రజల భద్రత కోసం.బాధ్యతతో ముందుకు సాగుతున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News