Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:25 PM

ఏఐ, డిజిటల్ లెర్నింగ్‌పై విద్యార్థులకు శిక్షణ

17-06-2026 102 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం సూచించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్న–అక్క మెంటర్‌షిప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న డిజిటల్ లెర్నింగ్ శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదో సెమిస్టర్‌లో భాగంగా తృతీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహిస్తున్న ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణా శిబిరాన్ని ఈ నెల 17, 18 తేదీల్లో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అధ్యాపకులు డాక్టర్ జనార్దన్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, భవిష్యత్ ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నేటి పోటీ ప్రపంచంలో డిజిటల్ నైపుణ్యాలు కీలకమని, విద్యార్థులు సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ.. విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు. ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి డాక్టర్ జె. చినబాబు, డాక్టర్ సీహెచ్. వెంకటేశ్వర్లు, డాక్టర్ జి. సునీత నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఏఐ, డిజిటల్ లెర్నింగ్‌పై విద్యార్థులకు శిక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News