Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:03 AM

ప్రజాసేవలో ఆమెకు సాటి ఎవరూ లేరు

ప్రజాసేవలో ఆమెకు సాటి ఎవరూ లేరు

ప్రజాసేవలో ఆమెకు సాటి ఎవరూ లేరు
17-06-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం పద్మావతి రెడ్డి.

కోదాడ నియోజకవర్గం లో రూ.1938 కోట్ల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రధాత.

భాషబోయిన భాస్కర రావు

కాంగ్రెస్ నాయకులు బాషబోయిన భాస్కర్ రావు ఆధ్వర్యంలో స్థానిక శాసన సభ్యురాలు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ

ప్రజాసేవను పరమావధిగా భావిస్తూ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆమె చూపుతున్న చొరవ, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఆమెను ప్రత్యేక నాయకురాలిగా నిలబెట్టాయని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు రూ.1938 కోట్ల నిధులను తీసుకువచ్చి రహదారులు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రదాతగా పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలిచారని తెలిపారు.కోదాడ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆమె చేపడుతున్న కృషి మరింత విజయవంతం కావాలని, భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 500 మందికి కేకు పులిహోర అందజేశారు. ఈ కార్యక్రమంలో పంది తిరుపతయ్య, రాయపూడి వెంకటనారాయణ, హనుమంతరావు, కాంపాటి శ్రీనివాసరావు, తాటికొండ నాగిరెడ్డి, లక్ష్మీనారాయణ, మహమ్మద్ రఫీ, మైకు నాగులు, కొరివి రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాసేవలో ఆమెకు సాటి ఎవరూ లేరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News