Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

వసతి గృహాల్లో సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి

07-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేలపట్ల ఎస్సీ హాస్టల్‌లో మున్సిపల్ కమిషనర్ 'హాస్టల్ నిద్ర'

విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 'హాస్టల్ నిద్ర' కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను ఆయన సందర్శించి, పర్యవేక్షించారు.​ఈ సందర్భంగా కమిషనర్ విద్యార్థులతో ముచ్చటించి వారి వివరాలు, చదువు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు హాస్టల్‌లోని వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వార్డెన్ నాగ సైదులును ఆదేశించారు.​ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన నోట్‌బుక్స్, ప్లేట్లు, గ్లాసులను విద్యార్థులకు ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

వసతి గృహాల్లో సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News