Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:30 PM

చర్లపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు ధ్వంసం,

18-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చర్లపల్లి వద్ద కెసీఆర్ పార్క్ సమీపంలోని స్మశానవాటిక వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో లారీ డివైడర్ దాటి రోడ్డుపై బోల్తా పడింది.

అదే సమయంలో రహదారి పక్కన ఇటుకల లారీ నుంచి ఇటుకలను దింపుతున్న మరో లారీ నిలిచి ఉండగా, చర్లపల్లి వైపు వెళ్తున్న మినీ డీసీఎం వాహనం ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ఘటనలో మినీ డీసీఎం వాహనం ముందుభాగంలోని క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది.

అయితే ప్రమాద తీవ్రతకు విరుద్ధంగా మూడు వాహనాల్లో ఉన్న డ్రైవర్లు, సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఇటుకలు దింపుతున్న కూలీలకు స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. వారికి స్థానికంగా చికిత్స అందించినట్లు సమాచారం.

ఒకేసారి రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Sthanikam

చర్లపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు ధ్వంసం,

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News