Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:51 AM

జర్నలిస్టుల సమస్యలపై గన్‌పార్క్ వద్ద టీడబ్ల్యూజేఎఫ్ ఆందోళన

18-06-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట నేతలు సహా పలువురు అరెస్ట్

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య పిలుపుమేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన టీడబ్ల్యూజేఎఫ్ నాయకులను, జర్నలిస్టులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.

ఈ ఆందోళనలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పాల్వాయి జానయ్య, జిల్లా కార్యదర్శి ముషం హరిప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి నందిపాటి సైదులు, కోదాడ నియోజకవర్గ నాయకులు ఎస్కే రహీం, వంగల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు తదితర జర్నలిస్టు నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా అడ్డుకొని, అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్‌లో తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధం. జర్నలిస్టుల గొంతు నొక్కే విధంగా పోలీసులు వ్యవహరించడం దురదృష్టకరం.

ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పాల్వాయి జానయ్య మాట్లాడుతూ, "జర్నలిస్టుల ఐక్యతే మా బలం. మా హక్కుల సాధన కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర నాయకత్వం ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేస్తాం. అరెస్టులకు, నిర్బంధాలకు మేము భయపడం. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం ఆగదు" అని స్పష్టం చేశారు.

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరపాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము.

Sthanikam

జర్నలిస్టుల సమస్యలపై గన్‌పార్క్ వద్ద టీడబ్ల్యూజేఎఫ్ ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News