Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:47 AM

విద్యా హక్కు చట్టం అమలులో ప్రభుత్వం విఫలం

18-06-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్ తప్పనిసరి: వట్టే జానయ్య యాదవ్

విద్యా హక్కు చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చినప్పటికీ, రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలో ఉండి కూడా సమర్థంగా అమలు చేయకపోవడం విచారకరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ విమర్శించారు.

గురువారం సూర్యాపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని విద్యా హక్కు చట్టం స్పష్టంగా పేర్కొంటుందని అన్నారు. ఆర్థిక స్థితి ఎలా ఉన్నా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ఈ చట్టం లక్ష్యమని తెలిపారు.

అనేక ప్రైవేట్ పాఠశాలలు ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని, ఫలితంగా పేద విద్యార్థులు అధిక ఫీజుల భారం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో సుమారు 75 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని గుర్తించామని, అవి అధిక ఫీజులు వసూలు చేస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సహించబోదని హెచ్చరించారు.

పేద విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో చట్టబద్ధ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కొన్ని పాఠశాలలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థి విభాగం తల్లిదండ్రులకు అండగా నిలిచి విద్యార్థుల హక్కుల కోసం కృషి చేస్తుందని తెలిపారు.

సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, మహిళా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మామిడి శోభన్, యువజన అధ్యక్షుడు కోలా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యా హక్కు చట్టం అమలులో ప్రభుత్వం విఫలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News