Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:31 PM

MPL కాలుష్యంపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తీవ్రం తహసీల్దార్‌కు బీఆర్‌ఎస్ నేతల వినతిపత్రం

18-06-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూన్ 18: చిట్యాల శివారు వట్టిమర్తి పరిధిలో ఉన్న MPL పరిశ్రమ నుంచి వెలువడుతున్న నల్లని పొగ, బూడిద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు చిట్యాల తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు.

పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర ప్రాంతాల గాలి నాణ్యత దెబ్బతింటోందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మవ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అధికారులు తక్షణమే స్పందించి MPL పరిశ్రమపై సమగ్ర విచారణ చేపట్టి, కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేయించాలని కోరారు. చిట్యాల మున్సిపాలిటీ ప్రజలను నల్లని బూడిద, వాయు కాలుష్యం బారిన పడకుండా రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మల గోటి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే షబానా అజీముద్దీన్, 9వ వార్డు బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఆగు అశోక్ యాదవ్, కునూరి శంకర్, ఉప్పలపల్లి నగేష్, జిట్ట కృష్ణ, మద్ది మధు, ఎస్‌కే జాంగీర్, సిల్వేరు యశ్వంత్, జిట్ట శేఖర్ తదితర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

MPL కాలుష్యంపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తీవ్రం తహసీల్దార్‌కు బీఆర్‌ఎస్ నేతల వినతిపత్రం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News