Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

క్యాన్సర్ చికిత్సలో “హైపర్ సైట్” టెక్నాలజీ ఒక విప్లవాత్మక మార్పు

18-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- దేశంలోనే తొలి ‘హైపర్ సైట్’ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన యశోద ఆసుపత్రి

- క్యాన్సర్ వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించడమే లక్ష్యం

- కన్సల్టెంట్ రేడియేషన్ ఆన్ కోలాజిస్ట్ డాక్టర్ స్రవంతి రెడ్డి

దేశంలోనే వైద్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్న సికింద్రాబాద్‌లోని ప్రముఖ యశోద ఆసుపత్రి క్యాన్సర్ చికిత్సలో మరో మైలురాయిని సాధించింది. భారతదేశంలోనే తొలిసారిగా అత్యాధునిక “హైపర్ సైట్” రేడియేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టి క్యాన్సర్ రోగులకు ప్రపంచ స్థాయి చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సంకల్ప హోటల్‌లో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి క్యాన్సర్ నిపుణురాలు డాక్టర్ టీ.స్రవంతి పాల్గొని క్యాన్సర్ నివారణ,ముందస్తు గుర్తింపు,ఆధునిక చికిత్సా విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...క్యాన్సర్ చికిత్సలో “హైపర్ సైట్” టెక్నాలజీ ఒక విప్లవాత్మక మార్పు అని పేర్కొన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ కణితుల పరిమాణం, స్థానం వంటి వివరాలను అత్యంత స్పష్టంగా,సెకన్ల వ్యవధిలో గుర్తించి ఖచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చన్నారు. దీని వల్ల కణితి చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన అవయవాలకు ఎలాంటి హాని కలగకుండా కేవలం క్యాన్సర్ కణాలపైనే రేడియేషన్ ప్రభావం చూపించవచ్చని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్,లంగ్ క్యాన్సర్,ప్రొస్టేట్ క్యాన్సర్,గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్లు, తల-మెడ భాగాల్లో వచ్చే వివిధ రకాల క్యాన్సర్ల చికిత్సలో ఈ టెక్నాలజీ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు. సాధారణంగా క్యాన్సర్ అంటే ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయని,అయితే వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుందని డాక్టర్ స్రవంతి పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీతో రోగులు ఆసుపత్రిలో గడపాల్సిన సమయం తగ్గడమే కాకుండా రేడియేషన్ దుష్ప్రభావాలు కూడా గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలు,అత్యాధునిక వైద్య సదుపాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో “హైపర్ సైట్”టెక్నాలజీ అందుబాటులోకి రావడం భారత వైద్య రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఆమె అన్నారు.ఎలాంటి సంక్లిష్టమైన క్యాన్సర్ కేసులకైనా అంతర్జాతీయ స్థాయి చికిత్స అందుబాటులో ఉందని,రోగులు ధైర్యంగా వ్యాధిని ఎదుర్కొని విజయాన్ని సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి సీనియర్ మేనేజర్ ఎం.వెంకట్,జనరల్ మేనేజర్ కె.సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్యాన్సర్ చికిత్సలో “హైపర్ సైట్” టెక్నాలజీ ఒక విప్లవాత్మక మార్పు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News