Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:18 AM

డ్రైన్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

18-06-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

వర్షాకాలం ప్రారంభమైయ్యే నేపథ్యంలో కాకతీయనగర్ డివిజన్ పరిధిలోని జేకే కాలనీలో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో కాలనీలో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు రూ.1.34 కోట్ల నిధులు మంజూరు చేయించి స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. డ్రైన్ పనులు త్వరగా చెయ్యాలని ఇంజనీరింగ్ సత్యలక్ష్మి కి ఫోన్ చేసి చెప్పారు.

భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిసిల్టింగ్ పనులు వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్ష కాలంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే ఇంజినీరింగ్ సిబ్బందిని కానీ వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ అయిన తనను కానీ సంప్రదించాలి అని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కాలనీలను సందర్శిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని క్యానం రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఓం ప్రకాష్ , సాయి సురేష్ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డ్రైన్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News