Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

మొండికుంట కాలువ ఆక్రమణలపై ‘బీజేపీ’ సమరం

మొండికుంట కాలువ ఆక్రమణలపై ‘బీజేపీ’ సమరం

మొండికుంట కాలువ ఆక్రమణలపై ‘బీజేపీ’ సమరం
18-06-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* సర్వే నెంబర్ 174, 175, 176 స్థలాల పరిశీలన

* నిర్మాణాలు కూల్చేసి, సరిహద్దులు తేల్చాలని ఆర్‌డీఓకు వినతి

చౌటుప్పల్ నుండి నాగారం (వలిగొండ) వెళ్లే ప్రధాన రహదారిలోని మొండికుంట కాలువ ఆక్రమణలపై చౌటుప్పల్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తమైంది. బీజేపీ నాయకులు ఆక్రమణలకు గురవుతున్న సర్వే నెంబర్ 174, 175, 176 పరిధిలోని ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. అనంతరం ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్‌డీఓ కి వినతిపత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. గత 2020 సంవత్సరంలో ఈ మొండికుంట కాలువ స్థలం ఆక్రమణకు గురికావడంతో అప్పటి మున్సిపల్ కమిషనర్ రామ్‌దుర్గారెడ్డి, జిల్లా కలెక్టర్‌లకు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. అప్పట్లో స్పందించిన అధికారులు.. 35 మీటర్ల పొడవుతో కల్వర్టు, 100 అడుగుల వెడల్పుతో కాలువ నిర్మాణం చేపడతామని హామీ ఇస్తూ, అక్రమ నిర్మాణాలను కూల్చివేశారని తెలిపారు. కానీ, ఇప్పుడు అదే స్థలంలో కనీసం 20 మీటర్ల పొడవు కూడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కల్వర్టును పునర్నిర్మిస్తున్నారని మండిపడ్డారు.చౌటుప్పల్ పట్టణానికి చెందిన 80 శాతానికి పైగా మురుగునీరు, వర్షపు నీరు ఈ వలిగొండ రోడ్డులోని మొండికుంట కాలువ గుండానే ప్రవహిస్తుందని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పూర్వపు యధాస్థితి ఉండేలా 200 మీటర్ల పొడవుతో కల్వర్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.​సర్వే నెంబర్ 174, 175, 176 పరిధిలోని భూముల్లో పరిమితికి మించి జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాలువ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని, ప్రభుత్వ భూమిని రక్షించేందుకు తక్షణమే సర్వే నిర్వహించి సరిహద్దులను గుర్తించాలని ఆర్‌డీఓను కోరారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రమనగోని శంకర్, పెద్దకొండూరు మాజీ సర్పంచ్ కాయితీ రమేష్ గౌడ్, మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు వంగాల రామాకాంత్ గౌడ్, వరగంటి భాను, బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి దిండు భాస్కర్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు పబ్బు వంశీ, మండల బీజేపీ ప్రధానకార్యదర్శి పబ్బతి శేఖర్, బాతరాజు ప్రవీణ్, పర్నె శ్రీనివాస్ రెడ్డి, కుంభ బాబు, బాపనయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మొండికుంట కాలువ ఆక్రమణలపై ‘బీజేపీ’ సమరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News