Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:00 PM

ప్రభుత్వ బడికే పెద్దపీట: ఆదర్శంగా నిలిచిన పీపల్ పహాడ్ సర్పంచ్ నాగేశ్వరి అశ్విన్ కుమార్

18-06-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తమ ఇద్దరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన వైనం

సర్పంచ్ బాటలోనే ఒకే రోజు చేరిన 25 మంది విద్యార్థులు

ప్రీ-ప్రైమరీ ఏర్పాటుతో తల్లిదండ్రుల్లో నూతన ఉత్సాహం

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని పీపల్ పహాడ్ గ్రామ సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ నిరూపించారు. ప్రభుత్వ పాఠశాలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఆమె ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ ఇద్దరి పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయంతో స్ఫూర్తి పొందిన గ్రామస్తులు.. అదే రోజు మరో 25 మంది విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించడం విశేషం. పాఠశాలలో నూతనంగా ప్రీ-ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) తరగతులను ఏర్పాటు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులలో నూతన ఉత్సాహం నెలకొంది.​ఈ సందర్భంగా సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గ్రామంలోని మౌలిక వసతుల కల్పనతో పాటు, పాఠశాలలో విద్యా ప్రమాణాలను, విద్యార్థుల ప్రగతిని తాను నిత్యం పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ బడుల్లో విద్యాబోధన జరుగుతుందని, తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని ఆమె కోరారు.​ పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బకనగారి శ్రవణ్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజన్ రెడ్డి, ఉపాధ్యాయురాలు ఉమాదేవి, గ్రామ కార్యదర్శి గీతారెడ్డి, వార్డు సభ్యులు ఎర్ర సువర్ణ అంజయ్య, ఎర్ర మహేష్, బద్దం సుధాకర్, మాదగోని గాలయ్య, ఎర్ర పూజా పరమేష్, గట్టు మల్లేష్, కొండ మమత, కారోబార్ ఎర్ర దానయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ బడికే పెద్దపీట: ఆదర్శంగా నిలిచిన పీపల్ పహాడ్ సర్పంచ్ నాగేశ్వరి అశ్విన్ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News