Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:30 PM

పచ్చదనమే భవిష్యత్‌.. మొక్కల సంరక్షణకు ముందుకురావాలి. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ. ఎమ్మెల్యే వేముల వీరేశం

19-06-2026 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మొక్కల పెంపకం, సంరక్షణలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంలో మొక్కలు నాటి పచ్చదనానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడం అంతకంటే ముఖ్యమైనది. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా తీసుకోవాలి’’ అని అన్నారు.అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి, విద్యే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పచ్చదనమే భవిష్యత్‌.. మొక్కల సంరక్షణకు ముందుకురావాలి. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ. ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మొక్కల పెంపకం, సంరక్షణలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంలో మొక్కలు నాటి పచ్చదనానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడం అంతకంటే ముఖ్యమైనది. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా తీసుకోవాలి’’ అని అన్నారు.అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి, విద్యే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News