Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:26 PM

మోదీ 12 ఏళ్ల పాలనతో దేశం అభివృద్ధి బాటలో ఇంద్రపాలనగరంలో బీజేపీ నాయకుల విశ్లేషణ

19-06-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచ అగ్రదేశాల సరసన నిలుస్తోందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మోదీ ప్రధాని పదవిలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.

జిల్లా కౌన్సిల్ సభ్యుడు పల్లపు దుర్గయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, నకిరేకల్ ఇంచార్జి నకిరేకంటి మొగులయ్య, మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అట్టడుగు వర్గాలకు చేరవేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందన్నారు. గ్రామపంచాయతీలకు నిధుల కేటాయింపు, మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, రవాణా, రక్షణ రంగాల్లో కేంద్రం చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని వివరించారు.

అవినీతి రహిత పాలన, పారదర్శక విధానాలతో భారతదేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా పెంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని కొనియాడారు.

కార్యక్రమంలో వార్డు సభ్యురాలు రేపాక పారిజాత, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు శివగల, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మల్లయ్య, గుడిగంట రామలింగం, నర్సోజు చంద్రయ్య, భువనగిరి మధు, శంకర్, సైదులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మోదీ 12 ఏళ్ల పాలనతో దేశం అభివృద్ధి బాటలో ఇంద్రపాలనగరంలో బీజేపీ నాయకుల విశ్లేషణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News