Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:19 PM

హయత్‌నగర్ సీఐగా శంకరయ్య.

హయత్‌నగర్ సీఐగా శంకరయ్య.

హయత్‌నగర్ సీఐగా శంకరయ్య.
19-06-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా శంకరయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్న పల్సా నాగరాజ్‌ గౌడ్‌ను మల్కాజిగిరి కమిషనరేట్‌ పోలీస్‌ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో మల్కాజిగిరి కమిషనరేట్ సీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న శంకరయ్యను హయత్‌నగర్‌కు బదిలీ చేయగా, ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం శంకరయ్య మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళల భద్రత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.

నూతన సీఐ బాధ్యతలు చేపట్టడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

హయత్‌నగర్ సీఐగా శంకరయ్య.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News