Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:15 PM

రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు జగ్గారెడ్డి కానుక

19-06-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 200 కిలోల భారీ కేక్‌ను చిన్నారులతో కలిసి కట్ చేసి, 350 మంది చిన్నారులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధికి బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఇక్రిశాట్, ఐఐటీ హైదరాబాద్ వంటి అనేక కీలక సంస్థలను అందించిందని, కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కేంద్ర రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు. నెహ్రూ కుటుంబం దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ, గత 12 ఏళ్ల మోదీ పాలనలో దేశానికి జరిగిన ప్రయోజనాలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువత ఆశలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. రాహుల్ గాంధీ దేశానికి అవసరమైన నాయకుడని, భవిష్యత్తులో ఆయన దేశ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, చిన్నారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు జగ్గారెడ్డి కానుక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News