Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 01:58 AM

పెద్దవూర వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం..

19-06-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

మృతుల్లో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు, వరంగల్ ఇంజినీర్..

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు..

పెద్దవూర : నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం స్టేజ్ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (ఐపీఎస్) శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద తీవ్రతను బట్టి ఘటన జరిగిన తీరును, వాహనాల స్థితిగతులను, రహదారి పరిస్థితులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రమాదానికి దారితీసిన కారణాలపై స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలను సేకరించి, సమగ్ర దర్యాప్తు జరపాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారిని పల్నాడు జిల్లా ముప్పాల మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన కాకర్ల థామస్య (51), ప్రకాష్ రావు (35)గా గుర్తించారు. వీరితో పాటు వరంగల్ ప్రాంతానికి చెందిన ఎస్ఎల్‌బీసీ (SLBC) సైట్ ఇంజినీర్ సాయికుమార్ (20) కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని వెంటనే నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నిబంధనలు పాటించకపోవడమే శాపం.. ఎస్పీ

​ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అతివేగం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వేగ పరిమితులు దాటకూడదు ఓవర్‌టేకింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు దర్యాప్తులో తేలనున్నాయి.

Sthanikam

పెద్దవూర వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News