శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి హుండీ ఆదాయం రూ.10.28 లక్షలు
శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి హుండీ ఆదాయం రూ.10.28 లక్షలు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో తెరిచి లెక్కించారు.సంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప, జూనియర్ అసిస్టెంట్ శివానంద్, మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో గత 89 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మొత్తం రూ.10,28,404 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప తెలిపారు. మంజీరా నది తీరాన వెలసిన ఈ ప్రసిద్ధ ఆలయానికి తెలంగాణతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకలు అమ్మవారిపై ఉన్న అపారమైన విశ్వాసం, భక్తిశ్రద్ధలకు నిదర్శనమని పేర్కొన్నారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, దేవస్థానం ప్రధాన అర్చకులు, ఎక్స్ అఫీషియో సభ్యుడు శ్రీకాంత్ స్వామి, రెవెన్యూ సిబ్బంది, ఆలయ అర్చకులు సిద్ధు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి, ఆలయ సిబ్బంది రమేష్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తుల విశ్వాసం, అమ్మవారి అనుగ్రహంతో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి