Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:16 PM

నారాయణఖేడ్‌లో టీఆర్ఎస్ జోష్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి భారీ చేరికలు

19-06-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాపు మల్ శెట్టి నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటించిన ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతే రాజు, సామాజిక న్యాయం, యువతకు ఉపాధి వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, సుమారు 20 కుటుంబాలు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి బాపు మల్ శెట్టి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా బాపు మల్ శెట్టి మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వమే తమ లక్ష్యమని, ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలతో మమేకమై పనిచేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగన్నాథ్‌పూర్‌కు చెందిన శరణప్ప, ఎనక్‌పల్లికి చెందిన నాగిరెడ్డి, నాగపూర్‌కు చెందిన కిషన్ నాయక్, బోరంచకు చెందిన సంగమేశ్, బాణాపూర్‌కు చెందిన సురేష్ పాటిల్, బెల్లాపూర్‌కు చెందిన మోహన్ చారి, హంగిర్గాకు చెందిన రేఖ నాయక్, బుల్లి భాయ్, బాబు నాయక్ తదితరులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో భీమయ్య ముదిరాజ్, విఠల్ చారి, మాణిక్యం ముదిరాజ్, మోహన్ నాయక్, ధీరజ్ ఆశీర్వాదం, ప్రశాంత్, నాగయ్య స్వామి, పండరి, ఆరిఫ్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారందరూ టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Sthanikam

నారాయణఖేడ్‌లో టీఆర్ఎస్ జోష్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి భారీ చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News