Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:20 PM

విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి: ఎస్ఎఫ్ఐ

విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి: ఎస్ఎఫ్ఐ

విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి: ఎస్ఎఫ్ఐ
19-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, జిల్లాలో విద్యా వ్యాపారాన్ని అరికట్టి, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా లావుడియా రాజు మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడుతున్నాయని ఆరోపించారు. ఫీజులు, బస్సు, ట్యూషన్, గేమ్స్ తదితర పేర్లతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. పాఠశాలల్లోనే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, షూస్ విక్రయిస్తూ విద్యను వ్యాపారంగా మార్చారని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అనేక చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులను ఒకేసారి పంపిణీ చేయాలని కోరారు.

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు హిందూరాణి, జిల్లా ఉపాధ్యక్షుడు రాహుల్, జిల్లా సహాయ కార్యదర్శులు తిగుల్ల శ్రీనివాస్, పుట్టల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి: ఎస్ఎఫ్ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News