Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 07:29 PM

ఫ్రైడే-డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

19-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే-డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట మండలం మసాయిపేట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.

ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవడంతో పాటు పాత సామగ్రి, ఉపయోగించని వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల కిచెన్‌షెడ్‌తో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. గ్రామాల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రత, ప్రజల్లో అవగాహన కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, ఎంపీడీవో, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఫ్రైడే-డ్రై డే నిర్వహణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News