Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:09 PM

పీఎస్‌ఆర్ నివాసంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణుల సందడి

19-06-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న జననేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా నాయకుడు పట్లోల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలోని పీఎస్‌ఆర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ దేశ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ మనవడిగా, రాజీవ్ గాంధీ వారసుడిగా, సోనియా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడిగా కొనియాడారు.అధికార పదవుల కంటే ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాలను తెలుసుకోవడమే నిజమైన నాయకత్వమని విశ్వసిస్తూ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండి దేశ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పీఎస్‌ఆర్ నివాసంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణుల సందడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News