Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:29 PM

బూత్‌లపై ఫోకస్.. సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి. నకిరేకల్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం

19-06-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్,

పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలోని సువర్ణ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. సభ్యత్వ నమోదును వేగవంతం చేయడంతో పాటు ఓటరు జాబితాలో అర్హుల పేర్లు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదు లక్ష్యాలు, బూత్ స్థాయి బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ప్రజలకు చేరువై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జి గుజ్జ దీపికా–యోగేంద్ర, మాజీ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ బూత్‌ల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Sthanikam

బూత్‌లపై ఫోకస్.. సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి. నకిరేకల్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News