Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

అనుమతులు లేని వీఆర్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

20-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అబ్దుల్లాపూర్‌మెట్,: ప్రభుత్వ అనుమతులు లేకుండా వీఆర్ జూనియర్ కళాశాలను నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఎస్ఎఫ్ఎ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్ ఆరోపించారు. కళాశాలను వెంటనే సీజ్ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తూ భారీ ఫీజులు వసూలు చేస్తున్నారని, పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని కళాశాల యాజమాన్యమే విక్రయిస్తూ బయట కొనుగోలు చేయకుండా ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. అనుమతులు లేకుండా విద్యాసంస్థ నిర్వహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.

సంబంధిత అధికారులు స్పందించి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కళాశాల కార్యకలాపాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ మండల కార్యదర్శి వంశీ, నాయకులు నరేందర్, హరీష్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అనుమతులు లేని వీఆర్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News