Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:29 AM

రెండు షాపులు.. ఒకే జీఎస్టీ నంబరా? నల్లగొండలో వ్యాపార వర్గాల్లో కలకలం

20-06-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

బ్రాండెడ్ ముసుగులో నకిలీ సరుకుల విక్రయాలపై ఆరోపణలు

పన్నుల ఎగవేత జరుగుతోందా..? విచారణకు డిమాండ్

మైనర్లతో పని చేయిస్తున్నారనే ఆరోపణలు.. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

నల్లగొండ పట్టణంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దుకాణాలకు ఒకే జీఎస్టీ (GST) నంబర్ వినియోగిస్తున్నారనే ఆరోపణలు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బ్రాండెడ్ ఉత్పత్తుల పేరుతో నాణ్యత లేని నకిలీ సరుకులను విక్రయిస్తూ భారీ ఎత్తున వ్యాపారం సాగుతోందని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

స్థానిక వ్యాపారుల కథనం ప్రకారం, పూజిత అపార్ట్‌మెంట్ సమీపంలో ఒక దుకాణం, ఉడిపి హోటల్ ఎదురుగా మరో దుకాణం నిర్వహిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ రెండు దుకాణాల కార్యకలాపాలు ఒకే జీఎస్టీ నంబర్ ఆధారంగా సాగుతున్నాయనే ప్రచారం ప్రస్తుతం పట్టణంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవేళ ఆరోపణలు నిజమైతే ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

అంతేకాకుండా, బ్రాండెడ్ ఉత్పత్తుల ముసుగులో నాణ్యత లేని ‘దో నెంబర్’ సరుకులను తక్కువ ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మార్కెట్లో రూ.200 విలువైన వస్తువులను రూ.150కు అందించడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటున్నారని, అయితే ఆ ఉత్పత్తులు ఎక్కువకాలం మన్నకపోవడంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

ఈ అక్రమ వ్యాపారాల కారణంగా సక్రమంగా పన్నులు చెల్లిస్తూ వ్యాపారం చేస్తున్న స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ ఉత్పత్తులను నాణ్యతతో విక్రయిస్తున్నప్పటికీ, నకిలీ వస్తువుల ధరలకు పోటీ ఇవ్వలేక అనేక మంది వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతున్నారని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, రాజస్థాన్ నుంచి మైనర్ బాలురను తీసుకొచ్చి చదువుకు దూరం చేస్తూ దుకాణాల్లో పని చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కార్మిక శాఖ, బాలల సంక్షేమ శాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇంతటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ సంబంధిత జీఎస్టీ అధికారులు, ఇతర శాఖలు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులు లేని వ్యాపారాలు, నకిలీ బ్రాండ్ల విక్రయాలపై ఆరోపణలు ఉన్నప్పటికీ తనిఖీలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాపార సంఘాలు పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో జీఎస్టీ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, కార్మిక శాఖ, పోలీసు శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

రెండు షాపులు.. ఒకే జీఎస్టీ నంబరా? నల్లగొండలో వ్యాపార వర్గాల్లో కలకలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News