Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:13 PM

658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్

20-06-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జడ్జి ఎం. హిమబిందు ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పెండింగ్ కేసులను పరస్పర రాజీ మార్గంలో పరిష్కరించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మొత్తం 658 కేసులు విజయవంతంగా పరిష్కారం అయినట్లు జడ్జి ఎం. హిమబిందు తెలిపారు. ప్రజలు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తమ వివాదాలను పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. రాజీ మార్గంలో కేసుల పరిష్కారం వల్ల ఇరువర్గాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంతో పాటు న్యాయం త్వరితగతిన అందుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సబ్ డివిజన్ ఎస్సైలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News