వడ్ల కొనుగోళ్ల పేరుతో తెలంగాణ రైతులపై కుట్ర... మాజీ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య
వడ్ల కొనుగోళ్ల పేరుతో తెలంగాణ రైతులపై కుట్ర... మాజీ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య
Bandi Kiran Kumar
కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వడ్ల కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధమని బీఆర్ఎస్ పార్టీ మాజీమండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం విలకర్ర సమావేశాల్లో మాట్లాడుతూ...వడ్ల కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు గతంలో టీడీపీని తిరస్కరించారని, బీజేపీకి కూడా ప్రజల్లో ఆదరణ లేదనే అసహనంతో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వడ్ల కొనుగోళ్ల అంశం కూడా ఆ కుట్రలో భాగమేనని వారు పేర్కొన్నారు.రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల అమలుపై కూడా కేంద్రం అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందకపోవడం, సాగునీటి సమస్యలు, విత్తనాలు, యూరియా కొరత, పండించిన పంటకు సరైన ధర లేకపోవడం వంటి సమస్యలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించలేకపోతే పదవిలో కొనసాగేందుకు నైతిక హక్కు లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో తెలంగాణ రైతులు అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నారని, ప్రస్తుతం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు గుండా గాని రాములు గౌడ్ సర్పంచ్ మనోజ్ గోపగాని రమేష్ కరకమల రవి రాములు, సోమేష్ పూర్ణనాయక్, గొప్పగాని వెంకన్న ,వెంకటేష్ ,నల్లబెల్లి వెంకటేష్ ,శ్రీకాంత్ మధు, సాయికిరణ్, మల్యాల రాములు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి