Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:29 PM

ఉద్యోగుల బదిలీల్లో సహకరించిన కలెక్టర్‌కు టీఎన్జీవో సన్మానం హెచ్‌ఆర్‌ఏ పెంపు, హాస్టళ్లకు నిధుల మంజూరుపై వినతి

20-06-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : సాధారణ బదిలీల ప్రక్రియలో ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ టీఎన్జీవో యూనియన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను సన్మానించారు.

ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి జే. శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన నేపథ్యంలో ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు కల్పించాలని కోరారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

తాము కోరిన వెంటనే వెటర్నరీ సబ్‌సెంటర్లలో అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకున్నందుకు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కూడా కలిసి పలు ఉద్యోగుల సమస్యలను వివరించారు.

కార్యక్రమంలో రాజు, నర్సింహాచారి, రణదేవ్, రమ్యసుధ, గోవర్ధన్‌రెడ్డి, ఆంజనేయులు, విజయకుమారి, భాస్కర్, సత్యనారాయణ, కాశీం, అజీముద్దీన్, సుమన్, దుర్గయ్య, వెంకటరమణ, శ్రీనివాస్, లక్ష్మి, యశ్వంత్, శంకర్‌రెడ్డి, సైదులు, సోమేశ్వరి, సునీత, విజయశాంతి, యూనస్, యాదమ్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యోగుల బదిలీల్లో సహకరించిన కలెక్టర్‌కు టీఎన్జీవో సన్మానం హెచ్‌ఆర్‌ఏ పెంపు, హాస్టళ్లకు నిధుల మంజూరుపై వినతి

Article Image

నల్గొండ, : సాధారణ బదిలీల ప్రక్రియలో ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ టీఎన్జీవో యూనియన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను సన్మానించారు.

ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి జే. శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన నేపథ్యంలో ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు కల్పించాలని కోరారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

తాము కోరిన వెంటనే వెటర్నరీ సబ్‌సెంటర్లలో అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకున్నందుకు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కూడా కలిసి పలు ఉద్యోగుల సమస్యలను వివరించారు.

కార్యక్రమంలో రాజు, నర్సింహాచారి, రణదేవ్, రమ్యసుధ, గోవర్ధన్‌రెడ్డి, ఆంజనేయులు, విజయకుమారి, భాస్కర్, సత్యనారాయణ, కాశీం, అజీముద్దీన్, సుమన్, దుర్గయ్య, వెంకటరమణ, శ్రీనివాస్, లక్ష్మి, యశ్వంత్, శంకర్‌రెడ్డి, సైదులు, సోమేశ్వరి, సునీత, విజయశాంతి, యూనస్, యాదమ్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News