Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాఠశాల వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సాయికుమార్ గౌడ్

21-06-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయస్సు నుంచే యోగా సాధన అలవాటు చేసుకుంటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సర్పంచ్ స్వయంగా పలు యోగాసనాలు వేశారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ వివిధ ఆసనాల ప్రాముఖ్యతను, వాటి ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్కు వెంకట్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు నేరటి మౌనిక సురేష్ యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పబ్బు జ్యోతి, గ్రామ పెద్దలు అంతటి మల్లేశం, నేరటి రమేష్, కే. రాజు గౌడ్, బద్దుల నరసింహ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాఠశాల వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సాయికుమార్ గౌడ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News