Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:25 PM

చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి

చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి

చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి
21-06-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి–65 పక్కన ఉన్న ‘7 హోటల్’ సమీపంలో ఓ లారీ క్లీనర్ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన లకేంద్ర (33)గా గుర్తించారు.

ఉపాధి నిమిత్తం వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరిన లకేంద్ర గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం చిట్యాలకు చేరుకున్న వారికి హోటల్ సమీపంలో కేంద్ర మృతదేహం కనిపించింది.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లకేంద్ర, సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం తో పాటు ఇటీవల నమోదవుతున్న తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై మృతిచెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఘటనపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వారు పోలీసులకు తెలిపారు.మృతుడి మేనబావ దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిట్యాల ఎస్‌ఐ ఎం. రవికుమార్ వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Sthanikam

చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News