Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 PM

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

21-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అంగన్‌వాడీ భవనం ప్రారంభం.. ఉచిత నేత్ర చికిత్స శిబిరానికి శ్రీకారం

రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, యువత విజ్ఞాన వికాసానికి ఉపయోగపడేలా మరమ్మతులు పూర్తి చేసిన గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ ఉరుమడ్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి, త్వరలో రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన, నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యాసంస్థల వైపు మొగ్గు చూపడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కంటి ఆరోగ్యంపై అవగాహన అవసరంఅనంతరం ఉరుమడ్లలోని తన స్వగృహంలో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ శరీరంలో కళ్ళు అత్యంత విలువైన అవయవమని, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

గ్రామ ప్రజల కోసం శంకర నేత్రాలయం అత్యాధునిక వైద్య సదుపాయాలు, శస్త్రచికిత్స ఏర్పాట్లతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్ర వినోద్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, వనమా వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News