Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:10 PM

జర్నలిస్టుల సంక్షేమానికి టీవైజేఎఫ్ కృషి అభినందనీయం

20-06-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీవైజేఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డా. తనుగుల జితేందర్ రావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభ్యులకు ఐడీ కార్డులు, హెల్త్ కార్డులు, అలాగే జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీవైజేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే టీవైజేఎఫ్ ప్రధాన లక్ష్యమని, సభ్యుల ఆరోగ్య భద్రత, కుటుంబ సంక్షేమం, పిల్లల విద్యాభివృద్ధి కోసం సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల కోసం మరిన్ని సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఇబ్రాహీం, అబ్దుల్ జబ్బార్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు జలీల్ రుస్తుం, ఉదయ్ పాటిల్, హెచ్. రాజు, నారాయణఖేడ్ కార్యదర్శి షేక్ జలీల్, ప్రధాన కార్యదర్శి రెడ్డి వినోద్, కంగ్టి మండల అధ్యక్షుడు ఎన్. ప్రకాష్, ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి మజరుద్దీన్, కోశాధికారి సంజు, ఉపాధ్యక్షుడు అబ్దుల్లా ఉస్మాన్‌తో పాటు టీవైజేఎఫ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు.

Sthanikam

జర్నలిస్టుల సంక్షేమానికి టీవైజేఎఫ్ కృషి అభినందనీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News