Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

కాన్సులేట్‌ రోడ్డుకు ‘ట్రంప్‌’ పేరు ప్రతిపాదన విరమించుకోవాలి

20-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌ బస్టాండ్‌ సమీపంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్‌ చేశారు. శనివారం చౌటుప్పల్‌ మండల కేంద్రంలో జిల్లా కోశాధికారి ఎండీ పాషా అధ్యక్షతన సీఐటీయూ మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అనంతరం కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కార్మికులు, నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి చౌటుప్పల్‌ బస్టాండ్‌ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.​ ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని అమెరికా కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్‌ పేరు పెట్టాలని చూడడం సరికాదన్నారు. పాలస్తీనా, ఇరాన్‌ దేశాల్లో వేలాది మంది మరణాలకు, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలకు కారణమవుతూ.. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న వ్యక్తి పేరును ప్రతిపాదించడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎండీ పాషా, జిల్లా కమిటీ సభ్యులు జొన్నకంటి దేవయ్య, సంఘం నాయకులు మాండ్ర శ్రీను, గుడ్డేటి పాపయ్య, గడ్డం వెంకటేష్, టి. మల్లేష్, కోళ్ళ మల్లయ్య, ఎల్లయ్య, సంజీవ, నవనీత, పార్వతమ్మ, సుగుణమ్మ, జయమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాన్సులేట్‌ రోడ్డుకు ‘ట్రంప్‌’ పేరు ప్రతిపాదన విరమించుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News