Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:09 PM

నాడు దేశ సేవ లో ఖ్యాతి గాంచిన సైనికుడు ఉత్తమ్..

నాడు దేశ సేవ లో ఖ్యాతి గాంచిన సైనికుడు ఉత్తమ్..

నాడు దేశ సేవ లో ఖ్యాతి గాంచిన సైనికుడు ఉత్తమ్..
June 20, 2026 12:17 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

నేడు ప్రజా సేవ లో అలుపెరుగని ఉత్తమ్....

కోదాడ హుజూర్ నగర్ నియోజక వర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమ్...

ప్రజాసేవ శ్వాస గా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మంత్రి ఉత్తమ్.....

అభివృద్దే ఆయన ఆశయం.. జనం మాటే ఆయన బాట...

రైతుల పాలిట బాంధవుడు ... ప్రాజెక్టుల అపర భగీరథుడు మంత్రి ఉత్తమ్...

మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు..

ఎర్నేని ఆధ్వర్యంలో కోదాడ లో అంబరాన్నంటిన మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు.......

కోదాడ హుజూర్ నగర్ నియోజక వర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమ్ అని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శని వారం కోదాడ శకుంతల ధియేటర్ వద్ద రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల మధ్య నిర్వహించి మాట్లాడారు. నాడు దేశ సేవ లో ఖ్యాతి గాంచిన సైనికుడు ఉత్తమ్

నేడు ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి జీవితాన్ని ప్రజల కు త్యాగం చేస్తున్నారన్నారు. మంత్రి వర్గం లో కీలక శాఖలు చేపట్టి రాష్ట్రం లో అభివృద్ధి నీ పరుగులు పెట్టిస్తు ప్రభుత్వం లో కీలకంగా మారిన అగ్ర నేత ఉత్తమ్ అన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి గా రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సాగు నీరు ఇబ్బందులు కలుగకుండా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్న అపర భగీరదుడు ఉత్తమ్ అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గా రాష్ట్రం లో ఏ ప్రభుత్వం చేపట్టని పథకం సన్న బియ్యం పధకం అమలు చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న అన్న దాత ఉత్తమ్ అన్నారు. కోదాడ హుజూర్ నగర్ నియోజక వర్గాలు రెండు కళ్ల లా భావిస్తూ రెండు నియోజక వర్గాల్లో రోడ్లు, విద్యా, వైద్య, విద్యుత్,సాగు నీరు, తాగు నీరు, విద్యుత్ సదుపాయాల కోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించిన అభివృద్ధి ప్రదాత అన్నారు. ప్రజలే కుటుంబంగా భావించి దంపతులు ఇద్దరు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజల గుండె ల్లో నిలిచారని కొనియాడారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లోనే కాదు సూర్య చంద్రులు ఉన్నంత వరకు మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి ల పేరు రాష్ట్ర మొత్తం ఉంటుందన్నారు. ఉన్నత విద్యలు అభ్యసించి నేడు రాష్రాన్ని దేశం లో ఆదర్శం గా నిలుపుతున్న అపర మేధావి ఉత్తమ్ అన్నారు. దేశ విదేశాలు పర్యటించి రాష్ట్ర గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటిన అగ్ర నాయకుడు ఉత్తమ్ అన్నారు. భవంతుని ఆశీస్సులతో భవిష్యత్తు లో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాక్షించారు. కాగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ భారీగా నినాదాలు చేశారు. పట్టణం లో భారీ కట్ అవుట్ లు కట్టి ఉత్తమ్ జన్మ దినం పండుగ లా చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోనాయకులు అల్తాఫ్ హుస్సేన్ బండల్ కోటిరెడ్డి పాశం శీను తోట జ్యోతి నాగేంద్రమ్మ నేహా నాజ్ ఉప్పుగల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ ఫయాజ్ కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణారావు మైలార్శెట్టి భాస్కర్ ఒంటి పులి శ్రీనివాస్ లైటింగ్ ప్రసాద్ కాజా వేమూరి సతీష్ చందు నాగేశ్వరరావు నెమ్మది దేవమని ప్రకాష్ బాబు మాతంగి శైలజ కెజ్జమ్మ ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News