Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:05 AM

ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ లిటరసీ, ఏఐ శిక్షణతో నాణ్యమైన విద్య

20-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

డిజిటల్ లిటరసీ, ఏఐ కోర్సు శిక్షణ నైపుణ్యంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం కోదాడ పట్టణంలో ఈఎంసీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు 9,10 వ తరగతి తరగతి విద్యార్థుల కోసం ఈనెల 15 నుండి 20వ తేదీ వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక డిజిటల్ లిటరసీ, ఏఐ కోర్సు శిక్షణ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏఐ కోర్సు సిలబస్ పుస్తకాలతో కంప్యూటర్ ఆపరేటింగ్, చాట్ జిపిటి, ఏఐ స్కిల్స్ అప్లికేషన్, డిజైన్ థింకింగ్, మేకింగ్ ఆఫ్ కోడింగ్, పెయింటింగ్, విషయాలను విద్యార్థులు నేర్చుకోవడం వలన సబ్జెక్టు విషయాలకు అన్వయించుకుని, సాఫ్ట్వేర్ రంగంలో ఉజ్వల భవిష్యత్తును సాధించవచ్చునని పేర్కొన్నారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులను ప్రత్యేకంగా కంప్యూటర్ విభాగంనకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులతో పరిశీలించి, ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసినారు. పాఠశాలలో జరుగుతున్న నూతన అడ్మిషన్ల డెస్క్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, తహసిల్దార్ సంతోష్ కిరణ్, ఎంఈఓ సలీం షరీఫ్, పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు డి. మార్కండేయ, డిజిటల్ లిటరసీ, ఏఐ శిక్షణ మాస్టర్స్ ధీరజ్, రవితేజ, నాని, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ లిటరసీ, ఏఐ శిక్షణతో నాణ్యమైన విద్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News