Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులకు రైతు భరోస ఇవ్వలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి BRS నేత మట్టిపల్లి వెంకట్ యాదవ్.. పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 21, 2026 07:22 PM

​ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం * నాలుగు పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులు

June 21, 2026 04:03 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

​​ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

* నాలుగు పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులు

* ఈ నెల 26 వరకు దరఖాస్తులకు గడువు: చిట్యాల ఎంఈఓ సైదా నాయక్

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ తరగతులకు గాను ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి (MEO) పానుగోతు సైదా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన (10 నెలల కాలానికి) ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

* ​పోస్టుల ఖాళీలు ఉన్న పాఠశాలలు:

​ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల - నేరడ

​ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల - వట్టిమర్తి

​ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల - శివనేనిగూడెం

​ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల - పేరేపల్లి

​అర్హతలు, వయోపరిమితి వివరాలు:

​ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్: ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. బాల్య విద్య (Early Childhood Education) లేదా ప్రాథమిక బోధనలో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. గౌరవ వేతనం నెలకు రూ. 8,000 చొప్పున చెల్లిస్తారు.

* ​ఆయా పోస్టు

ఆయా పోస్ట్ కు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గౌరవ వేతనం నెలకు రూ. 6,000 చొప్పున చెల్లిస్తారు.

​వయస్సు: నోటిఫికేషన్ తేదీ నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, మరియు దివ్యాంగులకు (PHC) 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫారంతో పాటు అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ల నకళ్లను జిరాక్స్ కాపీ లను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియలో స్థానిక అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు

* ​దరఖాస్తు చేయు విధానం

​అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 22 (22-06-2026) నుండి 26 (26-06-2026) సాయంత్రం 4:00 గంటల లోపు చిట్యాల మండల విద్యాధికారి కార్యాలయం (MEO Office) నందు స్వయంగా అందజేయాలని కోరారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిశీలించబోమని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ సైదా నాయక్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News